Agitation for Drinking Water in Gooty అనంతపురం గుత్తిలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన..
🎬 Watch Now: Feature Video
Women Agitation to Provide Drinking Water: తాగునీటి సమస్యను తీర్చాలంటూ అనంతపురం జిల్లాలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. గుత్తి మున్సిపాలిటీలో పరిధిలో కొన్ని ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా తాగునీరు సరఫరా కావటం లేదని స్థానికులు ధర్నాకు దిగారు. నెలల తరబడి సమస్య పరిష్కారం కాకపోవడం లేదని.. తాగునీటికి కోసం తాము పనులన్ని ఆపుకుని నీళ్లు తెచ్చుకోవల్సి వస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదని భీష్మించి కూర్చున్నారు.
అధికారులు వెంటనే స్పందించి.. తమ సమస్యను పరిష్కరించాలని వారు ఆందోళన చేపట్టారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే తాగునీటి సమస్య ఏర్పడిందని .. కుళాయి పన్నులు కడుతూ కూడా ఈ దుస్థితిని ఎదుర్కొని రావడం దురదృష్టకరమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు అందకపోవడంతో ఎక్కువ ధరను చెల్లించి నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం సమస్యకు పరిష్కరమంటూ.. రెండు వారాలకు ఓ సారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి.. చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. మహిళల ఆందోళన వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.