thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 10:41 AM IST

ETV Bharat / Videos

Lady Hulchul in Kadapa నాది ఒంగోలు.. కడపలో మా బంధువులుంటారు ! పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన యువతి ..

Woman Hulchul in Kadapa RTC Bus Stand: కడప ఆర్టీసీ బస్టాండ్​లో రాత్రి ఓ యువతి హల్చల్ చేసింది. ఆమె ఏం చేస్తుందో తెలియని స్థితిలో అటు పోలీసులను, ఇటు ఆర్టీసీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టింది. గంటన్నర పాటు పోలీసులను ఇబ్బందులకు గురిచేసింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో బుధవారం రాత్రి ఆ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కి కడప బస్టాండుకు చేరుకుంది. బస్సు ఎక్కేటప్పుడు ఆమె మత్తులో ఉంది. స్టాండ్​కి వచ్చాక బస్సు అందరూ దిగుతుండగా ఆమెను కూడా దిగాలని కండక్టర్, డ్రైవర్ చెప్పారు. కానీ ఆమె దిగలేదు. బస్సులోనే పడుకొని ఉంది. మహిళా కండక్టర్ ఆమె ముఖంపై నీళ్లు చల్లింది. దీంతో ఒక్కసారిగా ఆమె రెచ్చిపోయి డ్రైవర్ కొట్టారంటూ అతను వచ్చి క్షమాపణ చెప్పేంతవరకు బస్సులో నుంచి దిగనని సీట్లోనే మొండిగా కూర్చుంది. పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ఎంత సేపు బతిమాలినప్పటికీ ఆమె కిందికి దిగలేదు. మహిళ కావడంతో పోలీసులు కూడా ఆచితూచి ప్రవర్తించారు. తనది ఒంగోలు అని.. కడపలో బంధువులు ఉన్నారంటూ.. ఆమె చెప్పే మాటలకు పొంతన లేకుండా పోయింది. చివరకు చిన్న చౌక్ ఎస్సై నాగతులసీప్రసాద్ ఆమెను పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు. సదరు యువతి మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.