కొత్తపల్లిలో వింత - చెట్టు మధ్యలో నుంచి అరటి గెల - ఆరటి చెట్టు 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 7:46 PM IST

Win a Banana from the Middle of Tree in Kothapalli : సాధారణంగా అరటి చెట్టుకు కాండం నుంచి గెల రావడం చూస్తుంటాం.. కానీ ఓ ఆరటి చెట్టుకు మాత్రం వింతగా నడి మధ్యలో గెల వచ్చింది. ఇలా గెల.. చెట్టు మధ్యలో రావడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లిలో జరిగింది. కొత్తపల్లిలో నివసిస్తున్న గణేష్ల చక్రం తన ఇంట్లో అరటి మెుక్కలు పెంచుతున్నారు. వాటిలో ఒకటి సుమారు 15 అడుగుల పొడవు పెరిగింది. అన్ని అరటి మొక్కల కంటే భిన్నంగా ఆ చెట్టు మధ్య నుంచి అరటి డొప్పలను తొలుచుకుంటూ గెల వచ్చింది. సాధారణంగా గెల డొప్పల మధ్య రావడం జరగదు. కానీ గణేష్ల చక్రం పెంచిన తోటలో అరటి గెల.. చెట్టు కాండం తొలుచుకుంటూ వచ్చింది.

Special Banana Win in Kothhapally : ఈ మొక్కను చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు అందరూ ఆసక్తిగా ఈ అరటిగెలను చూస్తున్నారు. చెట్టు మధ్యలో నుంచి వచ్చినప్పటికీ... అన్ని గెలల మాదిరిగానే మంచి అరటి కాయలు కలిగి ఉందని తోట యజమాని ఆనందం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.