Water Resources Department Announcement : 'సాగునీటి సమస్య వాస్తవమే.. పట్టిసీమ, పులిచింతల నుంచి మరో 10వేల క్యూసెక్కులు' - Irrigation for Kharif cultivation
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2023, 7:50 PM IST
Water Resources Department Provide Irrigation Water: కృష్ణా జిల్లాలో సాగునీరు లేకపోవడంతో పంట పొలాలు నెర్రలిస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. ఇకపై సాగునీటి కష్టాలు తొలగించేందుకు పులిచింతల ప్రాజెక్టు నుంచి 6 వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి 4,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ కేసీ డివిజన్ కార్యనిర్వాహక ఇంజినీర్ పీవీఆర్ కృష్ణారావు తెలిపారు. ఇకపై 10 వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్‌కు వస్తుందన్నారు. ఈ రోజు రైతుల సాగునీటి అవసరాల కోసం 11 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని తెలిపారు. వర్షాలు పడని కారణంగా సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.
ఈ సంవత్సరం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు నీరు రాలేదని కృష్ణారావు తెలిపారు. ప్రస్తుతం రైతుల సాగునీటి అవసరాలకు పులిచింతల, పట్టిసీమ నీటినే వినియోగిస్తున్నామని వివరించారు. గత రెండు, మూడు రోజులుగా సాగునీటికి ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనని.. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామని వెల్లడించారు. నీటి లభ్యత లేని కారణంగానే వారబందీ అమలు చేస్తున్నామని, రైతులు సహకరించాలని కృష్ణారావు కోరారు.