'ఎన్నికల వేళ ఓటర్ల జాబితాపై ఈసీ నజర్' రంగంలోకి బీఎల్వోలు - సవాలుగా మారిన మార్పులు, చేర్పులు - అల్లూరి జిల్లా తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 1:00 PM IST

Voter List Pending in Paderu 2023 : రెండు తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ... ఓటర్ల జాబితాల పారదర్శకతపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్​లో పలు చోట్ల ఇప్పటికో ఫారం-7 సమస్య సవాలుగా మారింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో బీఎల్వోలు ఓటర్ల జాబితాలో దిద్దుబాటు చర్యలు, వివరాలు సేకరిస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరు మండలం సుండ్రుపుట్టు ఓటర్ల లిస్టులో... మరణించినవారి ఓట్ల తొలగించేందుకు డిక్లరేషన్ రాలేదని బీఎల్వోలు (బూత్​ లెవల్​ ఆఫీసర్​) చెబుతున్నారు. సుండ్రుపుట్టులో సుమారు 30మంది పేర్లు ఓట్ల జాబితా నుంచి తొలగించేందుకు డెత్ సర్టిఫికెట్లు, డిక్లరేషన్లు రాలేదన్నారు. చింతల వీధిలో 15 మంది పేర్లు డబుల్ ఎంట్రీలు కనిపిస్తున్నాయి. సరికొత్త ఓటర్ల జాబితాలోని అవకతవకలపై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Death Certificate Issues in Voter Lists : కొత్త  ఓటరు లిస్టు జనవరిలో వస్తుందని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో మరణాల ఓటర్ల లిస్టు రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది ఆచూకీ లేదు ఇటువంటి వారు కూడా రద్దు చేసే అవకాశం లేనందున ఓటర్ల లిస్టులో మార్పులు అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.