Volunteer Withdraw Money From Woman Account: మహిళ ఖాతాలో నగదు మాయం.. ఏలూరు జిల్లాలో వాలంటీర్ నిర్వాకం - కొయ్యలగూడెం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Volunteer Withdraw Money From Woman Account: ఒంటరి మహిళకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు తెలియకుండా గ్రామ వాలంటీర్ రూ.1.70లక్షలు కాజేసిన సంఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ ఇటీవల తన ఖాతాలో నగదును జమ చేసేందుకు బ్యాంకుకు వెళ్లింది. నగదు జమ చేసిన అనంతరం తన ఖాతాలో ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందని అక్కడి సిబ్బందిని ఆరా తీసింది. ఇటీవల జమ చేసిన రూ.13,500 మత్రమే ఖాతాలో ఉన్నాయని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో ఆమె అశ్చర్యపోయింది. తన ఖాతాలో రూ.1.70 లక్షలు ఉండేవని.. వాటిని తాను తీసుకోలేదని.. ఆ నగదు ఏమయ్యాయో చెప్పాలంటూ బ్యాంక్ సిబ్బంది ముందు నాగమణి బోరుమంది. ఆమె అభ్యర్థన మేరకు బ్యాంకు స్టేట్మెంట్ను పరిశీలించిన సిబ్బంది.. వేలిముద్ర ద్వారా నగదును తీసుకున్నట్లు గుర్తించారు. అదే విషయాన్ని నాగమణికి తెలియజేశారు. దీంతో తన వద్ద తరచూ వేలిముద్రలు తీసుకుంటున్న వాలంటీర్ వినయ్ నగదు కాజేసినట్లు భావించిన ఆమె.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.