Viveka Murder Case Approver Dastagiri: కిడ్నాప్ కేసులో.. దస్తగిరికి 14 రోజుల రిమాండ్ - Dastagiri in Police Custody over Kidnapping Case
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 31, 2023, 1:36 PM IST
|Updated : Oct 31, 2023, 9:47 PM IST
Viveka Murder Case Approver Dastagiri in police custody: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని.. ఓ అమ్మాయి కిడ్నాప్ కేసులో ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేయడంతో... భార్య షబానా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. తన భర్తను చూపించాలని మూడు గంటల నుంచి వేడుకుంటున్నా.. కనీసం పట్టించుకోవడం లేదంటూ.. షబానా వాపోయింది. తన బంధువుల అమ్మాయి ప్రేమ వివాహన్ని వద్దంటూ.. ఇంటికి తీసుకొస్తుండగా.. కక్షపూరితంగా కిడ్నాప్ కేసు పెట్టి అరెస్టు చేశారంటూ.. ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలేం జరిగిందంటే... హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల కిందట ఎర్రగుంట్లకు చెందిన ఓ జంట.. ప్రేమ వివాహం(Love Marriage) చేసుకుంది. డ్రైవర్ దస్తగిరి యువతిని కారులో కిడ్నాప్ చేశారని.. రెండు రోజుల కిందట యువకుడి ఇంటికి వెళ్లి బెదిరించినట్లు తెలుస్తోంది. కులం పేరుతో దూషించాడని బాధితుడు లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కమలాపురం కోర్టులో హాజరుపరచగా.. దస్తగిరి సహా ఐదుగురికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.