విశాఖలో జీ-20 సదస్సు.. విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న నగరం - విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న విశాఖపట్నం వీడియో
🎬 Watch Now: Feature Video
Visakhapatnam shining in electric lights: విశాఖనగరం విద్యుత్ దీపాలు వెలుగులో ధగధగ మెరిసిపోతోంది. జీ-20 సదస్సు కోసం విశాఖలో పలు అభివృద్ధి, సుందరీకరణ పనులను అధికారులు చేపట్టారు. ప్రధాన ప్రాంతాలను ఆకర్షణీయంగా కనిపించేందుకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో విశాఖ నగరంలో జీ-20 సదస్సు శోభ ఉట్టిపడుతోంది. సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు నగరంలో బస చేశారు. అతిథులను ఆకట్టుకునేలా ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. రహదారులు, ఫుట్‌పాత్‌లను అందంగా తీర్చిదిద్దారు. బీచ్ రోడ్డుతో పాటు ప్రధాన కూడళ్లు, నగరంలో మార్గాలన్నీ విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతునాయి. మూడు రోజులపాటు జరిగే ఈ జీ-20 సదస్సు కోసం జీవీఎంసీ రూ.130 కోట్లు వెచ్చించి నగరంలో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేశారు. రాడిసిన్ బ్లూ హోటల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు ఉండే.. బస చేసే హోటళ్లు, సందర్శించే ప్రాంతాల్లో.. రోడ్లు, ఫుట్ పాత్లను కొత్తగా నిర్మించి వాటిని రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.
TAGGED:
G20 summit in Visakhapatnam