విశాఖ హార్బర్‌లో నీట మునిగిన ఫిషింగ్ బోట్లు వెలికితీత
🎬 Watch Now: Feature Video
Visakhapatnam Fishing Harbour Fire Accident : విశాఖ హార్బర్‌లో నీట మునిగిన ఫిషింగ్ బోట్లను బయటికీ తీసే ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 19న జరిగిన అగ్నిప్రమాదంలో 29బోట్లు నీటిలో మునిగాయి. ఈ పనులు విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఫిషింగ్ బోట్లను బయట తీసే పనిలో మత్స్యశాఖ, పోర్ట్ అధికారులు, మెరైన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మెకనైజైడ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు సహాయక చర్యలో పాల్గొంటున్నారు.
Visakhapatnam Fishing Harbour Fire Accident Updates : విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తంగా 40 నుంచి 50 బోట్ల వరకు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కో బోటు విలువ రూ. 80 లక్షల నుంచి కోటి విలువ ఉంటుందని మత్య్సకారులు తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా మొత్తం మంటల్లో చిక్కి అగ్నికి ఆహుతి కావడం వల్ల తమ బతుకులు ఒడ్డునపడ్డ చేపల్లా మారాయని స్థానిక మత్స్యకార కుటుంబాలు కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.