వైసీపీకీ ఓటేస్తేనే పథకాలు ఇస్తామన్న ఎమ్మెల్యే.. వేసేది లేదన్న మహిళ - ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
YCP GADAPA GADAPA PROGRAM: గడప గడపలో వైసీపీ ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తప్పడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిడగాం మండలంలోని మెట్టవలస, గోబ్బురులో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌ను ప్రజలు నిలదీశారు. గ్రామానికి రహదారి, తాగునీరు సౌకర్యం సక్రమంగా లేదని వారి గోడును వినిపించారు. రేషన్ కార్డు తీసేశారని ఒకరు.. ఉన్న పింఛన్‌ను తొలగించారని మరొకరు నాయకుడిని ప్రశ్నించారు. ఎక్కువ భూమి ఉంటే పథకం రాదని చెప్పి ఎమ్మెల్యే జారుకున్నారు. అక్కడినుంచి మరో వీధికి వెళ్తే అక్కడా కూడా అవే ప్రశ్నలు. సంక్షేమ పథకాలు రావట్లేదు.. వైకాపా ప్రభుత్వానికి ఓటు వేయమని ఓ మహిళ ముక్తకంఠంతో చెప్పింది. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే.. పథకాలు ఇస్తాం.. లేకుంటే ఇవ్వం మీరే ఆలోచించుకోండి అంటూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.