బిడ్డను మార్చేసి మృత శిశువును అప్పగించారు - ఆస్పత్రి సిబ్బందిపై మహిళా సంఘాల ఆగ్రహం - విజయవాడ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 5:34 PM IST
Vijayawada Governament Hospital : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది తమ బిడ్డను తారుమారు చేశారని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. డీఎన్ఏ పరీక్ష నిర్వహించి ఆ పాప తమదో కాదో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి మద్ధతు తెలుపుతూ స్థానిక మహిళా సంఘాల సభ్యులు డీఎన్ఏ పరీక్ష చేయించాలని ఆస్పత్రి అధికారులను కోరారు.
Baby Died in Vijayawada Hospital : పేదవాళ్లకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని మహిళా సమాఖ్య ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు.. పాలు పట్టిస్తామని తల్లి దగ్గర నుంచి తీసుకువెళ్లి, పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి చనిపోయిందంటున్నారు. ఆ బిడ్డ తమ బిడ్డ కాదని తల్లిదండ్రులు చెప్తున్నా.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని మహిళలు ఆరోపించారు. బిడ్డను మార్చారని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. మగ బిడ్డనే మార్చాం కదా అన్నట్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితులు వాపోయారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు కూడా లేవని ఆస్పత్రికి వచ్చినవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురికి ఒకే బెడ్ ఇస్తున్నారని... ఆస్పత్రిలో సరైన సిబ్బంది, సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.