People questioned MLA Jaganmohan Rao: ఎమ్మెల్యేను అడ్డుకున్న ప్రజలు.. సమస్యలపై నిలదీత - దాములూరు వద్ద వైరా నదిపై నిర్మించిన కాజ్వే
🎬 Watch Now: Feature Video
Veerulapadu Villagers Questioned MLA Jaganmohan Rao: నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు అనూహ్యమైన ఘటన ఎదురైంది. నందిగామ మండలం వీరులపాడు గ్రామస్థులు ఎమ్మెల్యేను పలు సమస్యలపై నిలదీశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానామిచ్చారు. వీరులపాడు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నందిగామ ఎమ్మెల్యే మొండితోక మొండితోక జగన్మోహన్ రావు పాల్గొనగా.. మండల కేంద్రాన్ని వీరులపాడు నుంచి మార్పు చేయటంపై గ్రామస్థులు ప్రశ్నించారు. అంతేకాకుండా దాములూరు వద్ద వైరా నదిపై నిర్మించిన కాజ్‌వేకి అనుసంధానంగా నిర్మించిన అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవటంపై ఎమ్మెల్యేను నిలదీశారు. రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని, మండల కేంద్రాన్ని వీరులపాడులోనే కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ.. మండల కేంద్ర మార్పు అంశం మండలం మొత్తానికి సంబంధించిన వ్యవహారమని సమాధానమిచ్చారు. దీనిపై మిగతా గ్రామాల ప్రజలను పిలిపించి మాట్లాడతానని అన్నారు. ఈ సమస్యపై ఎప్పుడు మాట్లాడటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని.. ఎప్పుడు పిలిచినా వస్తానని తెలిపారు. ఈ వ్యవహారాన్నంతటినీ సెల్ఫోన్లో రికార్డు చేస్తున్న ఓ యువకుడి సెల్‌ఫోన్‌ను ఎమ్మెల్యే అనుచరులు లాక్కున్నారు.