Vangaveeti Ranga Biography: విజయవాడలో 'రంగా అసలు కథ' పుస్తకం ఆవిష్కరణ - వంగవీటి రంగా పుస్తకం విడుదల
🎬 Watch Now: Feature Video
TDP Leader Kanna Laxmi Narayana Released Vangaveeti Ranga Book : వంగవీటి రంగా రాజకీయ జీవితాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయాలని.. గాళ్ల సుబ్రహ్మణ్యం రచించిన 'రంగా అసలు కథ' అనే రంగా జీవిత చరిత్ర పుస్తకాన్ని మాజీమంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విడుదల చేశారు. విజయవాడలో కాపునాడు ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో కన్నా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుని పుస్తకాన్ని రచించారని.. కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యంను ఆయన అభినందించారు. నేటితరం యువత రాజకీయాల్లో రాణించాలనే లక్ష్యంతో వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. విజయవాడ నగరంలో ఆ రోజుల్లో అభాగ్యులు ఎదుర్కొన్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి.. వంగవీటి రంగా ముందుండి పోరాడారని వివరించారు. నిర్భాగ్యులకు అండగా నిలిచారని తెలిపారు. మంచి నాయకుడ్ని కోల్పోవటం రాష్ట్ర దురుదృష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాపునాడు ఎనిమిది మందితో ప్రారంభమై.. అనేక ఆటంకాలను తట్టుకుని నేడు 10లక్షల మందితో విజయవంతంగా సాగుతోందని అన్నారు.