కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విజయవాడలో మహాధర్నా: వడ్డే శోభనాద్రీశ్వరరావు - Vadde Sobhanadreeswara Rao news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 7:24 PM IST
Vadde Sobhanadreeswara Rao on central govt: కార్మిక, కర్షక, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల (నవంబర్) 27, 28 తేదీల్లో విజయవాడలో జరగబోయే మహా ధర్నాను విజయవంతం చేయాలని.. రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు, కార్మిక, ప్రజా సంఘాలతోపాటు ప్రజలు కూడా స్వచ్చందంగా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Sobhanadreeswara Rao Comments: విజయవాడలో రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించిన నేతలు నవంబర్ 27, 28 తేదీల్లో జరగబోయే నిరసన కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ..''ఆగస్ట్ 24వ తేదీన దిల్లీలో జరిగిన రైతు, కార్మిక సంఘాల సమావేశంలో మహా పడావ్‌కు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లో మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన విజయవాడలో ఈ నెల 27,28 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. కార్మిక, కర్షక, రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.'' అని ఆయన అన్నారు.