Uttarandhra political leaders fire on Minister Peddi Reddy ఉత్తరాంధ్రుల్ని అవమానిస్తారా.. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా బుద్ధి చెప్తాం - Uttarandhra political leaders fire on Peddi Reddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 9:52 PM IST

TDP BJP Leaders Fires on Punganur Incident: పుంగనూరు ఘటనపై తెలుగుదేశం భగ్గుమంది. శ్రీకాకుళం జిల్లా వాసుల్ని.. బట్టలూడదీసి అవమానించారని (Attack on TDP Activist in Punganur).. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ గూండాలు దౌర్జన్యంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పం వరకు టీడీపీ సానుభూతిపరులు సైకిల్ యాత్ర చేస్తే.. పుంగనూరులో పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకోవడాన్ని ఎంపీ రామ్మోహన్ ఖండించారు. ఇది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవానికి సంబంధించినదని.. తక్షణమే పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్.. పెద్దిరెడ్డికి పుంగనూరును రాసిచ్చారా అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు నిలదీశారు. పుంగనూరు ఘటన ఉత్తరాంధ్ర వాసుల అత్మగౌరవానికి సంబంధించింది అని విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఒక్కసీటు కూడా రాకుండా వైసీపీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉత్తరాంధ్రవాసులందరిపైనా ఉందని తెలిపారు. సీఎం జగన్ ఉత్తరాంధ్ర వాసులను పూర్తిగా అణగదొక్కడానికే విశాఖకు వస్తా అని చెప్తున్నారని మండిపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.