Amit Shah's VSP Tour: విశాఖకు అమిత్‌షా.. బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి - విశాఖలో అమిత్ షా బహిరంగ సభ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18726325-615-18726325-1686472364470.jpg)
Amit Shah's public meeting in Visakhapatnam : నేడు విశాఖలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. రైల్వే గ్రౌండ్స్‌లో జరిగే మహాజన్ సంపర్క అభియాన్‌లో అమిత్ షా పాల్గొననున్నారు. సాయంత్రం 4గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్న అమిత్ షా.. 5 గంటలకు రైల్వే గ్రౌండ్స్‌లో బహిరంగసభలో మాట్లాడతారు. ఆయన సుమారు 40 నిమిషాలు ప్రసంగించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై అమిత్ షా ప్రసంగించనున్నారు. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, సభా వేదికపై 100 మంది ఆసీనులయ్యేలా సీటింగ్ కల్పించారు. జాతీయ, రాష్ట్ర ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు, జాతీయ నాయకురాలు పురందేశ్వరి సహా ప్రముఖులు పాల్గొననున్నారు. అనంతరం స్థానిక రాష్ట్ర నాయకులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ కి తిరుగు ప్రయాణం అవుతారు. అమిత్ షా పర్యటన సందర్భంగా మధ్యాహ్నం నుంచి విశాఖ నగరంలో స్వల్ప ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైల్వే గ్రౌండ్లో అమిత్ షా సభా ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.