రైల్వేస్టేషన్ వద్ద కర్నాటకకు చెందిన ఇద్దరు ఆత్మహత్యాయత్నం - ఒకరు మృతి - మంత్రాలయం మండలంలో ఇద్దరు ఆత్మహత్యాయత్నం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 10:48 PM IST
Two Persons Suicide Attempt in Kurnool District: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వారిద్దరికీ ఇప్పటికే వేర్వేరు వ్యక్తులతో పెళ్లి అయ్యింది. అందులో నేత్రావతి అనే మహిళకు భర్త, పిల్లలు ఉన్నాయి. అదే విధంగా రవి కుమార్ అనే వ్యక్తికి సైతం మరో మహిళతో పెళ్లి అయింది.. పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరూ కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వేస్టేషన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం సృష్టించింది. దీంతో వెంటనే స్థానికుల సమాచారంతో అపస్మారక స్థితిలో ఉన్న వీరిని పోలీసులు ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రవి కుమార్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందగా.. నేత్రావతి చికిత్స పొందుతున్నారు. రవికుమార్‌కు మరో మహిళతో పెళ్లై, పిల్లలు ఉన్నారు. నేత్రావతికి సైతం భర్త, పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిరువురూ కర్నాటక రాష్ట్రానికి చెందిన వారని.. వీరు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు.