Two Mens Died: తిరుపతి బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ప్రమాదం.. ఇద్దరు వలస కార్మికులు మృతి - Two Men Died
🎬 Watch Now: Feature Video
Two Men Died In Srinivasa Sethu Bridge Works: తిరుపతి స్మార్ట్ సిటీ, టీటీడీ సంయుక్తంగా నిర్మిస్తున్న.. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనుల్లో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అపశృతి చోటు చేసుకుంది. రైలింగ్‌పై సెగ్మెంట్ అమర్చుతున్న సమయంలో ప్రమాదం జరిగి ఇద్దరు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాస సేతు రైల్వే ఫ్లైఓవర్ పై జరుగుతున్న పనుల్లో భాగంగా.. అర్ధరాత్రి రైలింగ్‌పై సెగ్మెంట్‌ను అమర్చేందుకు ఎత్తుతుండగా క్రేన్ రోప్ తెగడంతో.. సెగ్మెంట్లు కిందపడ్డాయి. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కూలీలపై సెగ్మెంట్ పడిపోయింది. దీంతో దానికింద చిక్కుకున్న ఇద్దరు కూలీలు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిజిత్, బీహార్ కు చెందిన బార్డో మండల్‌గా గుర్తించారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఐదు గంటల పాటు శ్రమించి.. మృతదేహాలను వెలికితీసి రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.