TTD EO Dharma Reddy Meeting With Officials: తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు.. ప్రత్యేక దర్శనాలు రద్దు - తిరుపతి శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 5:37 PM IST
TTD EO Dharma Reddy Meeting With Officials: తిరుమల శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharma Reddy) వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. స్థానిక అన్నమయ్య భవనంలో జిల్లా యంత్రాంగంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం రోజునా స్వామివారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. గరుఢ సేవ రోజు రద్దీ దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయం చేసుకుంటారన్నారు. గరుఢ సేవ రోజున విభాగాల వారీగా పనిచేస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాలకు(Brahmotsavam ) జర్మన్ షెడ్లు వేసి లాకర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతి నగర ప్రాంతాలు శుభ్రంగా ఉంచేలా మున్సిపాలిటి అధికారులను కోరామన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు వైద్యం అందుబాటులోకి ఉండేందుకు రుయా ఆస్పత్రి నుంచి సిబ్బంది వస్తారన్నారని ఈవో పేర్కొన్నారు. వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఘాట్ రోడ్డులో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు నడుస్తాయని ఈవో వెల్లడించారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి కళ బృందాలు మాడ వీధుల్లో నృత్య ప్రదర్శనలు చేస్తారని పేర్కొన్నారు. గరుఢ సేవ ఉదయం 8 గంటల నుంచి రెండు గంటలపాటు సాగనుందని తెలిపారు. మళ్లీ రాత్రి 7 గంటల నుంచి వాహన సేవలు అందుబాటులో ఉంటాయిని ఈవో తెలిపారు. గరుఢ సేవ రోజు రాత్రి 7 గంటలకు వాహన సేవా మొదలై భక్తులందరూ వీక్షించే వరకు వాహన సేవ ఉంటుందన్నారు. 22న గరుఢ సేవ సందర్భంగా ఘాట్ రోడ్డుల్లో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిషేధించినట్లు ఈవో పేర్కొన్నారు.