వైద్యులు లేని ప్రభుత్వాస్పత్రి - సంతకం చేసి వెళ్తున్నారని గిరిజనుల ఆందోళన - టీడీపీ ఇంచార్జి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 2:51 PM IST

Tribals Concern That No Doctors In Government Hospital: ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల గిరిజన గ్రామంలోని  ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఉండటం లేదని గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. తమ గ్రామం మండల కేంద్రానికి దూరంగా ఉంటుందని, రాత్రి వేళల్లో ఏమైనా జరిగితే తమ పరిస్థితి ఏంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఆ గ్రామానికి వచ్చిన టీడీపీ ఇంఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు వద్ద వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేవలం సంతకాలు చేసి వెళ్లిపోతున్నారే తప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులే ఉండటం లేదని ఎరిక్షన్ బాబు మండిపడ్డారు.

TDP In-charge Complained In District Collector: తామంతా ఉండేది అటవీ ప్రాంతం కాబట్టి సమయానికి వైద్యం చేయటానికి ఆసుపత్రిలో వైద్యులు లేకపోతే ఎలా అని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని వారు కోరుతున్నారు. గిరిజనుల సమస్యలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్​కు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. స్థానిక సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని ఎరిక్షన్ బాబు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.