విహార యాత్రలో విషాదం - వంజంగి కొండల్లో గుండెపోటుతో పర్యాటకుడు మృతి - పాడేరు పర్యాటక కేంద్రం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 12:27 PM IST
Tragedy in a Popular Tourist Destination in Alluri District : అల్లూరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి కొండల్లో విషాదం నెలకొంది. వంజంగి కొండల్లో ఓ పర్యాటకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ప్రముఖ ఇంగ్లిష్ పత్రికలో పనిచేస్తున్న వేణుగోపాల్ మిత్రులతో కలిసి పాడేరులో పర్యటించారు. ఈ రోజు తెల్లవారుజామున వంజంగి కొండను ఎక్కుతుండగా వేణుగోపాల్‌కు గుండెపోటు వచ్చింది.
Person Died of Heart Attack : వేణుగోపాల్‌కు గుండెపోటు రావడంతో తన మిత్ర బృందం అప్రమత్తమై అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. గుండెపోటు వచ్చిన వేణుగోపాల్‌ను కొండపై నుంచి రహదారి మార్గానికి అత్యంత కష్టంగా చేర్చారు. అంబులెన్స్ సిబ్బంది వేణుగోపాల్‌ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం వేణుగోపాల్ మృతదేహన్ని పాడేరు ఆసుపత్రికి తరలించారు. విహారంలో విషాదం జరగడం వల్ల వేణుగోపాల్ మిత్రులు బాధలో మునిగిపోయారు. విహారానికి వెళ్లిన వేణుగోపాల్ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.