వాహనాలను ఎత్తిపడేసిన సుడిగాలి - గాలిలో పల్టీలు కొట్టిన ఆటోలు, కూలిన చెట్లు
🎬 Watch Now: Feature Video
Tornado in Kakinada carries Autos away: కాకినాడ జిల్లాలో సుడిగాలి కలకలం రేపింది. గండేపల్లి మండలం మల్లేపల్లి శివారు జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంకు ఎదురుగా, సుడిగాలి భారీగా లేచింది. కొద్దిదూరం దూసుకెళ్లిన సుడిగాలి, స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఈ సుడిగాలిదాటికి రహదారిపై వెళ్తున్న ఆటోలు గాలికి కొట్టుకుపోయాయి. సుడిగాలి తమ వైపు వస్తుందంటూ పెట్రోల్ బంకులోని ఉద్యోగులు పరుగులు తీశారు.
మరోవైపు, అన్నవరం రైల్వే గేటు వద్ద సైతం సుడిగాలి చెలరేగింది. సుడిగాలి దాటికి రైల్వే గేటు సమీపంలో ఆగి ఉన్న వాహనాలు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. సుడిగాలి దాటికి ఓ ఆటోతో పాటుగా, టాటాఏస్ వాహనం ఎగిరిపడింది. ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. మరో చోట విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. రైల్వే గేట్ పక్కనే ఉన్న ఓ ఇంటి రేకులు సైతం సుడిగుండం ధాటికి కొట్టుకుపోయాయి. అనంతరం పంపా రిజర్వాయర్ వైపు కదలడంతో రిజర్వాయర్లోని నీరుతో పైకి ఎగిసి పడింది.