SRIVANI TRUST PAPER RELEASED: తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ ఛైర్మన్ శ్వేతపత్రం విడుదల - SRIVANI TRUST WHITE PAPER RELEASED

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 23, 2023, 2:02 PM IST

Srivani Trust has released a white paper white paper: తిరుమలలో శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు, విమర్శలపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం స్పందించింది. శ్రీవాణి ట్రస్టు నిధులకు సంబంధించిన శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ఆ పత్రంలో ట్రస్టు ద్వారా వచ్చిన నిధుల డిపాజిట్లు, కొత్త ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు ఖర్చు చేసిన వివరాలను వెల్లడించింది. ట్రస్ట్ ప్రారంభమైన రోజు నుంచి మే 31, 2023 వరకు దాదాపు రూ.861 కోట్ల నిధులు ట్రస్టుకు వచ్చినట్లు పేర్కొంది. 

శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల.. శ్రీవాణి ట్రస్టు నిధులకు సంబంధించి.. నేడు స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిసి శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఛైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభం నుంచి మే 31, 2023 వరకు రూ.861 కోట్లు నిధులు వచ్చాయి. ట్రస్ట్ నిధులు వివిధ బ్యాంకుల్లో రూ.602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.36.50 కోట్లు వచ్చాయి. ఎస్​బీఐ ఖాతా కింద రోజూవారీ వచ్చే డబ్బు మరో రూ.139 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. దేవాలయాలు నిర్మాణం, పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటిదాకా రూ.120.24 కోట్లు ఖర్చు చేశాం.  రాజకీయ లబ్ధి కోసం శ్రీవాణీ ట్రస్ట్‌పై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన వారిపై న్యాయ సలహా తీసుకొని.. కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తితిదేలో ఎంతటి వాడైన అవినీతి చేయడానికి భయపడాల్సిందే. తప్పు చేస్తే శిక్ష తప్పదు.'' అని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.