Three people died due thunder bolt in Guntur బీభత్సం సృష్టించిన వర్షం.. ఉమ్మడి గంటూరు జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 10:31 AM IST

Three people died due thunder bolt in Guntur రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిడుగులు పడి మగ్గురు మృత్యువాత వడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలను నీట మునిగి.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రహాదారుల పరిస్థితి సరేసరి. భారీగా మురుగు నీరు రోడ్లపైకి రావడంతో.. ప్రయాణికులు తీవ్ర అవస్థ పడ్డారు. గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఆకస్మికంగా వర్షం కురిసింది. కృష్ణా జిల్లా ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. మంగళగిరిలో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రహదారిపై భారీగా మురుగు పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఓ వైపు నగరంలో జ్వరాలు పెరుగుతున్న సమయంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

పిడుగు పడి ఇద్దరు మృతి..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల పరిధిలో భారీ వర్షంతో పాటు పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. వారు వెళుతున్న మార్గంలో భారీ వర్షం రావడంతో రోడ్డు పక్కన చెట్టుకు అనుకొని వేసిన చిన్న పందిరిలోకి వెళ్లారు. పందిరి కింద ఉన్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ప్రమాదంలో నరసరావుపేటకు పట్టణానికి చెందిన సయ్యద్ అమీర్(29), నరసరావుపేట మండలం రావిపాడుకు చెందిన ఆలూరి ఆరోగ్యం(58) అక్కడికక్కడే మృతి చెందారు.

బాపట్ల జిల్లాలో ఓ బాలిక మృతి..

బాపట్ల జిల్లా అమృతలూరు మండలం యడవూరుకు చెందిన జోషిత పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయింది. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతన్న బాలిక ఇంటి వద్ద పిడుగుపాటుకు గురవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జోషిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.