Theft Attempt In Vykuntapuram Temple: ఆలయంలో తలనీలాల చోరీకి యత్నం.. అడ్డుకున్న కానిస్టేబుల్‌కు గాయాలు - గుంటూరు జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Theft Attempt In Vykuntapuram Temple: తెనాలి వైకుంఠపురం వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి యత్నించారు. వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని కేశఖండనశాలలో భక్తులు సమర్పించిన తలనీలాలను చోరీ చేసేందుకు నలుగురు దొంగలు ప్రయత్నించారు. ఇది గమనించి అప్రమత్తమైన వాచ్‌మెన్ డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావడాన్ని గమనించిన దుండగులు వెంటనే అప్రమత్తమై పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రమేశ్.. దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ దుండగుల్లో ఒకరు రమేశ్‌ను పన్నెండు అడుగుల రేకుల షెడ్డు పైనుంచి కిందకు తోయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ రమేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. దుండగుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. నిందితులను జీవన్ తేజ్, సాయి కుమార్, నవీన్ గా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో మరొకరి ఇంకా తెలియరాలేదు.