'వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాదరణ కోల్పోయారు' - జనసేన లోడెడ్ విత్ చిరు యువత భారీ ర్యాలీ - చిరు యువత భారీ ర్యాలీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-01-2024/640-480-20451768-thumbnail-16x9-the-power-of-janasena-loaded-with-chiru-yuvatha-rally.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 6:34 PM IST
|Updated : Jan 7, 2024, 6:43 PM IST
The Power of Janasena Loaded with Chiru Yuvatha Rally: నెల్లూరులో చిరంజీవి యువత, జనసేన కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కనకమహాల్ సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. 'ది పవర్ ఆఫ్ జనసేన లోడెడ్ విత్ చిరు యువత' అంటూ నిర్వహించిన ర్యాలీలో తామంతా ఒకటేనని వారు తెలిపారు. మిత్రపక్షాల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధిపొందేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని జనసేన నేత కిషోర్ విమర్శించారు. ప్రజాదరణను నోచుకోలేని ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నుంచి ఎగిరిపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాట పాడుతోందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల గెలుపు కోసం తామంతా కృషి చేస్తామన్నారు.
"'ది పవర్ ఆఫ్ జనసేన లోడెడ్ విత్ చిరు యువత' అనే పేరుతో మేము ఈరోజు భారీ ర్యాలీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా మా చిరంజీవి యువత మద్దతుగా నిలుస్తాం. ప్రజాదరణను నోచుకోలేని ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్సార్సీపీ నుంచి ఎగిరిపోతున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల గెలుపు కోసం మేమంతా కృషి చేస్తాం." - కిషోర్, జనసేన నేత