వర్షాలు లేక నీళ్లు రాక పొలంలోనే ప్రాణాలొదిలిన కౌలు రైతు - guntur latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 4:59 PM IST
Koulu Raithu Died in Guntur : గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో కౌలురైతు ఇజ్రాయిల్ (55) గుండెపోటుతో మృతి చెందాడు. ఇజ్రాయిల్ నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక కాలువల నుంచి నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. పొలానికి నీళ్లు పెట్టడానికి మోటర్ తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఒక్కడే పొలంలో కూర్చొని ఉన్నాడు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కూర్చున్న చోటే కుప్పకూలి పోయాడు.
Koulu Raithu Died With Heart Attack in AP 2023 : సమీపంలో ఉన్న తన కుమారుడు, మరో వ్యక్తి గమనించి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఇజ్రాయిల్ మృతి చెందినట్లు వారి గుర్తించారు ఇజ్రాయిల్ భార్య 10 సంవత్సరాల చనిపోయారు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పొలం పనులకు వెళ్లిన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లారని.. ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.