అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు చేయాలన్నది టీడీపీ ఆలోచనే: శ్రావణ్ కుమార్ - TDP State Secretary Daasari Raja

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 4:39 PM IST

Tenali Sravan Kumar About Ambedkar Statue: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఆలోచన తెలుగుదేశం పార్టీదే అని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు.  విగ్రహం డిజైన్ మార్చి, వ్యయం పెంచటం మినహా వైసీపీ చేసిందేమి లేదని శ్రావణ్ వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ అమరావతిలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, స్మృతివనం ఏర్పాటు పనుల్ని ఆపివేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విజయవాడ విగ్రహం గురించి గొప్పలకు పోతున్నారని  శ్రావణ్ కుమార్ ఎద్దేవ చేశారు. 

TDP State Secretary Daasari Raja: స్కిల్ కేసులో సుప్రింకోర్టు ఆదేశాలను వక్రీకరిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజా తప్పుబట్టారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఏవీ నిలబడవని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవ్వి, జగన్ జైలుకు వెళ్లటం ఖాయమని రాజా స్పష్టం చేశారు.

Ambedkar Statue: స్టాట్యూ ఆఫ్ సోషల్​ జస్టిస్ పేరుతో అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం (రేపు) ముఖ్యమంత్రి జగన్ విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్నారు. ఈ విగ్రహాన్ని 4 వందల కోట్ల రూపాయిలతో 125 అడుగుల ఎత్తు ఉండేలా తయారు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.