అధికారుల నిర్లక్ష్యం - రైతుల పాలిట శాపం : మున్నేరు ఆనకట్టకు గండికొట్టిన తెలంగాణ రైతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 12:16 PM IST

thumbnail

Telangana Farmers Damaged Munneru Dam : ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి సమీపంలోని మున్నేరు ఆనకట్టకు తెలంగాణ రైతులు మంగళవారం రాత్రి గండికొట్టారు. దీంతో కాలువలకు మళ్లాల్సిన సాగునీరు వృథాగా దిగువకు పారుతోంది. ఆంధ్రా, తెలంగాణ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తెలంగాణ రైతులకు రావాల్సిన నష్ట పరిహారం చెల్లింపులో జాప్యం వల్లే గండి కొట్టినట్లు తెలుస్తోంది. 

Munneru Dam Issue : నీటి నిల్వ కోసం ఉన్న కట్టకు 15 అడుగుల మేర గండి పడటంతో నీరంగా వృథాగా దిగువకు పోతోంది. దీంతో ఆయకట్టులోని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనికి 20వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో వరి సాగు పూర్తవ్వగా, 5 వేల ఎకరాల్లో మిర్చి సాగులో ఉంది. రబీలో సుమారు 5 వేల ఎకరాల్లో నారుమడులు పోశారు. ఈ ఏడాది జూన్‌ నెలలో తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా మునేరుకు పెద్దఎత్తున వరద వచ్చిన విషయం తెలిసిందే.

 Munneru Dam in Andhra Pradesh : ఈ విషయమై మున్నేరు డీఈ రామకృష్ణ మాట్లాడుతూ "తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో నష్టపరిహారం చెల్లింపు ఆలస్యం అయింది. నష్టం అంచనాలు తెలంగాణ అధికారులే నిర్ణయించాల్సి ఉంది. వారి నుంచి నివేదిక వచ్చిన తర్వాతే ఆంధ్రా నుంచి పరిహారం మంజూరు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ఆ పని మీదే ఉన్నాం. ఈలోగా మంగళవారం రాత్రి కట్టలు తెంచేశారు" అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.