CPS Cancellation జీపీఎస్‌పై ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించలేము : ఏపీటీఎఫ్ - teachers on cps cancellation
🎬 Watch Now: Feature Video
teachers on cps cancellation: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెస్తామంటున్న జీపీఎస్ పెన్షన్ విధానం ఉద్యోగుల గొంతు మరింత నొక్కేలా ఉందని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు బసవలింగారావు అన్నారు. సీపీఎస్ రద్దుపై ఎటువంటి హామీ ఇవ్వని రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. కానీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి.. దాని నుంచి వైదొలగరని అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హామీపై ఉద్యోగులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో సీపీఎస్, జీపీఎస్ ఒక్కటి కాదని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. సీపీఎస్‌లో అనేక లోపాలున్నాయని.. రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వాదనను అంగీకరించలేమని అన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని గతంలో పోరాటం చేసినట్లు.. పోరాట ఫలితంగా అప్పుడు ఉన్న ప్రభుత్వాలు కంట్రీబూషన్, ఫ్యామిలీ పెన్షన్, పార్శల్ డిపాజిట్లు వంటి సదుపాయలను కల్పించిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తానని.. ఓపీఎస్ తీసుకోస్తానని అన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం తెస్తామంటోన్న జీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్న ఏపీటీఎఫ్ నేతలతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.