ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది - న్యాయం చేయాలంటూ టీడీపీ సానుభూతిపరుల ఆవేదన - TDP Sympathizers About Life Threat ycp leader
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 7:06 PM IST
TDP Sympathizers About Life Threat From YCP MLA: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి (Rachamallu Siva Prasad Reddy) నుంచి తమకు ప్రాణహాని ఉందని.. స్థానిక తెలుగుదేశం సానుభూతిపరులు భరత్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపించారు. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసు నిందితుడు బెనర్జీపై జరిగిన దాడి కేసులో.. భరత్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలను పోలీసులు తమవారిని అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని ఇబ్బందులకు గురి చేయకుండా.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపాలని.. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.
బెనర్జీపై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని తెలిపారు. గొడవను ఆపడానికి మాత్రమే వెళ్లారని అన్నారు. టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి వెంట తిరుగుతున్నారనే.. తమ వారిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.