Achchennaidu fire on police: 'నేరస్తుల్ని వదిలి అమాయకులపై కేసులా.. వైసీపీ జేబు సంస్థగా పోలీసులు' - వైసీపీ నేతలు
🎬 Watch Now: Feature Video
Achchennaidu fire on police: నరసరావుపేట ఘటనలో పోలీసులు నేరస్తుల్ని వదిలి అమాయకులపై కేసులు పెడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దాడి చేసిందెవరో నరసరావుపేట ప్రజలందరికీ తెలుసన్న ఆయన.. ఎమ్మెల్యే ఆగడాలు డీజీపీకి కనిపించడం లేదా అని నిలదీశారు. దాడి చేసిన ఎమ్మెల్యేని వదిలేసి బాధితులపై హత్యాయత్నం కేసులు దుర్మార్గమని దుయ్యబట్టారు. అభివృద్ధికి మారుపేరైన నరసరావుపేటను అరాచకాలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. డీజీపీ దృష్టిలో బాధితులే నిందితులా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను అధికార వైఎస్సార్ పార్టీ నేతల జేబు సంస్థగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రౌడీయిజం చేస్తున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారని అచ్చెన్నాయుడు నిలదీశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి వందల మంది రౌడీ మూకతో తెలుగు దేశం పార్టీ నేతలపై దాడులకు పాల్పడడం వాస్తవం కాదా అని మండిపడ్డారు. ఎవరి ఇళ్లపై ఎవరు దాడి చేశారో, ఎవరి హత్యకు ఎవరు యత్నించారో పోలీసులకు తెలియదా..? అంటూ మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని రక్తసిక్తం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.