TDP Pattabhi:జగన్ రెడ్డి చంద్రబాబుతో పాఠాలు చెప్పించుకోవాలి : టీడీపీ నేత పట్టాభి - r 5 zone

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 4, 2023, 2:17 PM IST

TDP spokesperson Kommareddy Pattabhiram: పేదలను పదేపదే మోసం చేసే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌ అని తెలుగుదేశం విమర్శించింది. పేదలకు మేలు చేసే ఉద్దేశం సీఎంకు ఏమాత్రం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. R3 జోన్‌లో ఇళ్లు కట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ..పేదలను మోసం చేసేందుకే R5 జోన్‌ సృష్టించారని మండిపడ్డారు. అమరావతి ఆర్ - 3 జోన్​లోని భూమిలో 44 ఎకరాల్లో చంద్రబాబు 5,024 ఇళ్లు పేదలకోసం నిర్మించారని పట్టాభిరామ్‌ తెలిపారు. నేడు కూడా అదే ఆర్ -3 జోన్ లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 1675 ఎకరాల భూమి సిద్ధంగా ఉంటే.. కొత్తగా మరో జోన్ ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటని ఆయన నిలదీశారు. పేదలకు ఇళ్లు నిర్మించడం ఎలాగో తెలియకపోతే.. జగన్ రెడ్డి చంద్రబాబుతో పాఠాలు చెప్పించుకోవాలని హితవుపలికారు. మూడున్నరేళ్లుగా రెండు జిల్లాల్లోని పేదల కోసం నిర్మిచాల్సిన ఇళ్లలో కేవలం 4.7 శాతం మాత్రమే నిర్మించారన్న ఆయన... ఇదేనా జగన్ రెడ్డికి పేదలపై ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఆడుతున్న జగన్నాటకంలోని గుట్టుమట్లు పేదలు అర్థం చేసుకోవాలని పట్టాభిరామ్‌ కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.