TDP Somireddy Powerpoint Presentation on Power Scam: విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ కుంభకోణం : సోమిరెడ్డి - స్మార్ట్ మీటర్ పేరుతో భారీ స్కాం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 1:27 PM IST
|Updated : Oct 26, 2023, 2:35 PM IST
TDP Somireddy Powerpoint Presentation on Power Scam : విద్యుత్ రంగంలో భారీ ఎత్తున ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణం జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వివిధ కెపాసిటీలతో ఉన్న ఒక్కో ట్రాన్స్ ఫార్మరులోనే లక్ష నుంచి 8 లక్షల రూపాయల వరకు దోపిడీ జరిగిందని ధ్వజమెత్తారు. విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందంటూ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
TDP Leader Somireddy Chandramohan Reddy Comments on YSRCP Government : వరుస కుంభకోణాల సీక్వెల్‌కు ప్రభుత్వం తెర తీసిందని సోమిరెడ్డి మండిపడ్డారు. విద్యుత్ రంగంలో అవినీతిని విడతల వారీగా బయటపెడతామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ట్రాన్సఫార్మర్ల కంటే చాలా అధిక మొత్తంలో ఏపీలో ధరలు ఉన్నాయని విమర్శించారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో దాదాపు 62 శాతం మేర ఆర్డర్లు షిర్టీ సాయి సంస్థకే వెళ్తున్నాయని దుయ్యబట్టారు. షిర్టీ సాయి సంస్థకు నాసిరకం ట్రాన్సఫార్మర్లు సరఫరా చేస్తోందనే అంశంపై గత ప్రభుత్వం పెనాల్టీ విధించిందని, ఆ పెనాల్టీని జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. పెనాల్టీ రద్దు వెనుక మరో స్కాం ఉందని ఆరోపించారు.
Somireddy Comments on Smart Meter Scam : పవర్ స్కాం పార్ట్-2లో మరిన్ని వివరాలు బయటపెడతానని సోమిరెడ్డి తెలిపారు. ఈ స్కాంను వదిలిపెట్టేదే లేదని.. స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అరబిందో.. షిర్డీ సాయి సంస్థలు జగన్ దత్త పుత్రులని ఆరోపించారు. ఈ రెండు సంస్థలకు పుట్టిన పుత్రుడు ఇండోసోల్ సంస్థ అని అన్నారు. ఇండోసోల్ ప్రాజెక్టుకు సోలార్ ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు.