మంత్రి కాకాణి మాటలు విన్న అధికారులు సస్పెండయ్యారు - ఆయన జైలుకు వెళ్లక తప్పదు: సోమిరెడ్డి - కాకాణి గోవర్దన్‌రెడ్డిపై సోమిరెడ్డి ఆరోపణలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-11-2023/640-480-19993468-thumbnail-16x9-somireddy-allegations-on-minister-kakani.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 5:51 PM IST
TDP Somireddy Allegations on Minister Kakani: ప్రజా ప్రతినిధులపై కేసులు త్వరగా తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో.. మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని.. తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణిపై (Kakani Govardhan Reddy) అరడజన్, సీఎం జగన్‌పై డజన్ కేసులున్నాయని.. సోమిరెడ్డి వివరించారు. కాకాణి గోవర్దన్‌రెడ్డి.. సర్వేపల్లి నియోజకవర్గంలో 3 వేల 779 ఎకరాలు అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అన్నారు.
మట్టి, ఇసుక, గ్రావెల్, మైన్స్ దోపిడీకి ముఖ్యమంత్రి జగన్.. కాకాణికి లైసెన్స్ ఇచ్చారన్నారు. ఇతర కేసుల విషయం ఎలా ఉన్నా సరే.. తన కేసుల్లో మాత్రం కాకాణి జైలుకి పోవడం తప్పదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి కాకాణి మాటలు విని భూముల కుంభకోణంలో అయిదుగురు వైసీపీ నాయకులు జైలుకెళ్లారని.. అదేవిధంగా పలువురు అధికారులు సస్పెండ్ అయ్యారని విమర్శించారు. కాకాణి దుర్మార్గానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు.