thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 7:40 PM IST

ETV Bharat / Videos

TDP Protest Against Chandrababu Arrest: 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి'.. చంద్రబాబుకు మద్దతుగా కుప్పంలో భారీ నిరసన ర్యాలీ

TDP Protest Against Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుకు మద్దతుగా చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కక్ష పూరితంగా చంద్రబాబుపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని టీడీపీ కార్యాలయం వద్ద దీక్షలో పాల్గొన నాయకులు, కార్యకర్తలకు సంఘీభావంగా... పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలు నల్ల బెలూన్ల తో నిరసన చేపట్టారు. 

చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలను సీఐడీ నిరూపించలేకపోతోందని అన్నారు. అధికార వైసీపీ నేతలు పసలేని ఆరోపణలతో ప్రజల్లో అభాసు పాలవుతున్నారని విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయమని హెచ్చరించారు. ఇకనైనా కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు త్వరలోనే కడిగిన ముత్యంలా విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నినాదాలు హోరెత్తాయి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.