TDP Municipal councillors Agitation: చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆందోళనలు.. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా.. - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కౌన్సిలర్ల నిరసన
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-09-2023/640-480-19641010-thumbnail-16x9-municipal-council.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 10:44 PM IST
TDP Municipal councillors Agitation: స్కిల్ కేసులో టీడీపీ ఆధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా.. టీడీపీ నేతలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఖండాంతరాలు దాటిని ఈ నిరసన జ్వాలాలు రగూలుతూనే ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆందోళనకు దిగారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మున్సిపల్ ఛైర్మన్ పోడియం ముందు బెఠాయించి.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
కౌన్సిల్ సమావేశంలో నిరసనలు, ఆందోళనలు నిబంధనలకు విరుద్దమని ఛైర్మన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకు దిగిన కౌన్సిలర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్కు తరలించిన తర్వాత కూడా కౌన్సిలర్లు తమ నిరసనను అలాగే కొనసాగించారు. సాయంత్రం వరకు నిరసన కొనసాగించి.. సాయంత్రం విరమించారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. కౌన్సిలర్ల నిరసనకు మద్దతుగా పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు.