TDP MLCs complaint to Governor ఉద్యోగాల భర్తీపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్సీలు - చంద్ర బాబు వార్తలు
🎬 Watch Now: Feature Video
TDP MLCs complain to Governor on unemployment : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ఖాళీల భర్తీపై తెలుగుదేశం ఎమ్మెల్సీలు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. లక్షలాది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ 2, గ్రూప్ 3, జూనియర్ లెక్చరర్లు, ఏఈ, ఏఈఈ పోస్టులు భర్తీకి చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 70శాతం పైగా పోస్టులు భర్తీ చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కువ ఏకోపాధ్యా పాఠశాలలు ఉన్నందున విద్యార్థుల సంఖ్యా తగ్గిపోతోందని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్ లోన్లు, టీఏ డీఎలు సకాలంలో చెల్లించేలా చూడాలని కోరారు. కడప జిల్లా విద్యాశాఖాధికారి రాఘవ రెడ్డి తనకు లేని అధికారులను ఆపాందించుకోని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇటీవల టీచర్లకు పదోన్నతులు, బదిలీలు జరిగాయి. వీటిలో అధికార దుర్వినియోగానికి పాల్పడి నిబంధనలను విరుద్ధంగా వ్యవరించడం జరిగింది అన్నారు. ఆదర్శంగా ఉండాల్సిన విద్యశాధికారి, విద్యశాఖకే తలవంపులు తెచ్చే విధింగా వ్యవహరిస్తున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కడప డీఈవో పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం ఉద్యోగులను కూడా తీవ్రంగా వేధిస్తోందని ఎమ్మెల్సీలు గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్ను కలిసి వారిలో ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు.