TDP MLC fires on YCP land encroachment పులివెందులలో భారీ భూ కుంభకోణం.. ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయడం లేదు: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి - భూ ఆక్రమణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 24, 2023, 4:18 PM IST
TDP MLC fires on YCP land encroachment in Pulivendula : ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అధికార వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని అమ్ముకొంటున్నారు. ఒకవేళ అధికారులు అడ్డుకునేందుకు యత్నిస్తే.. నకిలీ పత్రాలు సృష్టించి జనానికి కుచ్చుటోపీ పెడుతున్నారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల పట్టణంలో నకిలీ ఎన్ఓసీలు సృష్టించి వంద కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నాయకులు కాజేశారని తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ (TDP MLC) భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. 14 నకిలీ ఎన్ఓసీ లు సృష్టించి 60 ఎకరాల భూములను వెంచర్లుగా వేశారని ఆయన తెలిపారు. ఆక్రమిత భూములను ప్రజలకు పాట్లుగా విక్రయిస్తున్నారని భూమిరెడ్డి ఆక్షేపించారు. చుక్కల భూములకు ఎన్ఓసీ (NOC) లు ఇవ్వకుండా కలెక్టర్ తిరస్కరించినా.. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కయి నకిలీ నిరభ్యంతర పత్రాలను తయారు చేశారని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై ఆర్డీఓ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆక్షేపించారు. రెండు రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోకపోతే అన్ని ఆధారాలతో కుంభకోణాన్ని బయటపెడతానని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు.