TDP MLAs MLCs Condemned Chandrababu Arrest: ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు.. ప్రజలంతా మా వెంటే : టీడీపీ - చంద్రబాబు అరెస్టుపై బాలకృష్ణ ఆగ్రహం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2023, 12:26 PM IST

TDP MLAs MLCs Condemned Chandrababu Arrest: శాసనసభలో చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తడమే.. తెలుగుదేశం ప్రధాన ఎజెండా అని ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మేల్సీలు స్పష్టం చేశారు. వెంకటపాలెంలోని ఎన్టీఆర్​ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత శాసనసభకు పాదయాత్రగా వెళ్లారు. చేసిన తప్పుకు ప్రభుత్వం భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం శాసనసభాపక్షం అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది.  తెలుగుదేశం ఎమ్మెల్యేలతోపాటు.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు నిరసనల్లో పాల్గొన్నారు. 

సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నిరసన చేపట్టారు. చంద్రబాబుపై కక్ష - యువత భవితకు శిక్ష అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. అక్రమ కేసు ఎత్తివేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి నినాదాలతో.. టీడీపీ నేతలు కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna Fired) స్పష్టం చేశారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదని అన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని గళమెత్తటమే ప్రధాన అజెండా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌నేత యనమల రామకృష్టుడు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.