వైసీపీ బస్సు యాత్ర కోసం మొక్కలు తొలగింపు - టీడీపీ నేతల నిరసన - ycp leaders removed plants for Bus Yatra
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 9:32 PM IST
TDP Leaders Protest Against Removal of Plants: దశాబ్ద కాలంగా సంరక్షించిన మొక్కలను తొలగించడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలోని డివైడర్‌పై ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈనెల 10వ తేదీన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర (YCP Samajika Sadhikara Bus Yatra) ఉన్న కారణంగా మొక్కలు తొలగించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. డివైడర్‌పై ఉన్న మొక్కలు తొలగించడం అన్యాయమంటూ.. టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర రావు పాల్గొన్నారు.
పాత బస్టాండ్ నుంచి రాయగడ రోడ్డు వరకు తొలగింపు జరిగిందని అధికారులను ప్రశ్నించారు. కాలుష్యం నివారించేందుకు పచ్చదనాన్ని పెంపొందించేందుకు దశాబ్ద కాలం క్రితం తెలుగుదేశం హయాంలో మొక్కలు నాటడం జరిగిందని వారు గుర్తు చేశారు. కమిషనర్ రామప్పల నాయుడు వద్ద మొక్కలు తొలగించడాన్ని ప్రస్తావించారు. కొత్త మొక్కలు వేసే ఆలోచనలో వాటి తొలగింపు జరిగిందని ఆయన వివరించారు. వైసీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మొక్కలను తొలగించడం సరైనది కాదని అన్నారు. ప్రకృతికి హాని కలగచేసే హక్కు ఎవరికీ లేదని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని టీడీపీ నాయకులు తెలిపారు.