డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారికీ ఓట్లు - కడప కలెక్టర్‌కు తెలుగుదేశం నేతల ఫిర్యాదు - టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసరెడ్డి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 7:08 PM IST
TDP Leaders On Voter LIst In Kadapa : కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారు జాబితాలో ఉన్నారని కడప కలెక్టర్ విజయరామరాజును కలిసి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఓటర్ల జాబితాలో బూత్‌ల వారీగా తప్పులను ఆధారాలతో సహా కలెక్టర్‌కు అందజేశామని టీడీపీ నేతలు వెల్లడించారు. తమ ఫిర్యాదుపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఓటర్ల జాబితాపై మరోసారి పరిశీలన చేయిస్తానని హామీ ఇచ్చారని నేతలు తెలిపారు.
TDP Kadapa Incharge To Collector Office : ఎన్నికల్లో ఎటువంటి తప్పులు దొర్లకూడదని. ఓట్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని తాము ఓటర్ జాబితాను పరిశీలిస్తున్నామన్నారు. కడప టీడీపీ ఇంఛార్జ్ మాధవీ రెడ్డి కలెక్టర్‌తో మాట్లాడామన్నారు. తప్పులు ఉన్న ఓటర్ లిస్ట్ వివరాలను కలెక్టర్‌కు అందించామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసరెడ్డి సహా పలువురు టీడీపీ కార్యకర్తలు కలెక్టర్‌ను కలిశారు.