మురుగు పారుతున్నా పట్టించుకోవట్లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన - డ్రైనేజిీ సమస్యపై వైసీపీ టీడీపీ గొడవ తాడిపత్రి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 3:50 PM IST
TDP Leaders, Muncipal Chair Person Protest in Anantapu : అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార పార్టీ నేతలు, మున్సిపల్ అధికారులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఏళ్ల తరబడి మురుగు పారుతున్నా పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై టీడీపీ కౌన్సిలర్లతో కలిసి ఆయన మురుగు నీటిలో దిగి నిరసన తెలిపారు. అక్కడికు వచ్చిన వైకాపా నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురికి సర్ది చెప్పారు.
Drainage Problems in Thadipatri : సంవత్సరాలు గడుస్తున్నా డ్రైనేజీ సమస్యను తీర్చడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మురుగు కాల్వ నీరు రోడ్లపైకి చేరడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందని వాపోయారు. ఇది ఇలాగే కొనసాగితే రోగాలు ప్రబలుతాయని, కాస్త పట్టించుకోండని అధికారులను ప్రాధేయపడుతున్నారు.