ప్రతిపక్షాలపై జగన్‌కు నరనరానా కక్ష సాధింపే!: నారా లోకేశ్ - వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఆగ్రహం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 10:36 PM IST

TDP Leaders met Governor Justice Abdul Nazeer: రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు తెలుగుదేశం నేతల బృందం విజ్ఞప్తి చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ముఖ్య నేతలు అచ్చెన్నాయుడు, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, అశోక్ బాబు, ధూళిపాళ్ల నరేంద్ర గవర్నర్‌ను కలిశారు. ప్రతిపక్షాలపై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు గవర్నర్‌  ఫిర్యాదు చేశారు.

 గవర్నర్​ని కలిసిన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాలపై జగన్‌కు నరనరానా కక్ష సాధింపే ఉందని ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పోలీసుల తీరును గవర్నర్‌కు తెలిపామని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని ఆరోపించారు. వైసీపీ పాలనలో దక్షిణ భారతదేశ బిహార్‌గా ఏపీ మారిందని ఆయన విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.