TDP Leaders Meet Nara Bhuvaneshwari: 'బాబు అరెస్టు రాజకీయ కక్షసాధింపులో భాగమే'.. నారా భువనేశ్వరికి టీడీపీ నేతల సంఘీభావం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 4:14 PM IST
TDP Leaders Meet Nara Bhuvaneshwari: రాజమహేంద్రవరంలో ఉన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి పలువురు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపి.. ఆమెను పరామర్శించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయకపోయినా.. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా అరెస్టు చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. చంద్రబాబు అరెస్టులో వైసీపీ, బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరని అభిప్రాయ పడ్డారు.
రాజమహేంద్రవరంలో భువనేశ్వరిని హర్షకుమార్ పరామర్శించారు. చంద్రబాబును అరెస్టు చేయడం.. కొరివితో తల గోక్కున్నట్లేనని సీఎం జగన్‌కు తెలిసొచ్చిందని.. తెలుగుదేశం నేతలు అన్నారు. గంటా శ్రీనివాసరావు, జవహర్, బుచ్చయ్య చౌదరి సహా పలువురు మాజీ మంత్రులు.. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం.. తెలిపారు. కష్టకాలంలో చంద్రబాబు కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. వీరితో పాటు గద్దె అనురాధ కూడా భారీ సంఖ్యలో మహిళలతో వచ్చి భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు.