ఓటు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా - టీడీపీ నేతల ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
Complaint on Minister Vidadala Rajini Wrong Address Vote: మంత్రి విడదల రజిని (Vidadala Rajini) తప్పుడు చిరునామాతో ఓటుకు దరఖాస్తు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గెలిచిన రజినికి, అక్కడ పురుషోత్తమపట్నంలో ఓటుహక్కు ఉంది. ఆమెను ఇటీవల గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో ఆమె ఓటుని గుంటూరుకు మార్చుకునే క్రమంలో తప్పుడు చిరునామా ఇచ్చారని టీడీపీ నేతలు గుంటూరు వెస్ట్ ఓట్ల నమోదు అధికారికి ఫిర్యాదు చేశారు.
శ్యామలా నగర్లోని 9-2-98 ఇంటి నెంబర్, సాయి గ్రాండ్ ఆపార్ట్ మెంట్లో ఉన్నట్లు రజిని దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే ఆ చిరునామాకు వెళ్లి చూస్తే ఖాళీ స్థలం ఉందని టీడీపీ నేతలు తెలిపారు. దీనికి సంబంధించి ఆధారాలతో సహా ఓట్ల నమోదు అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. డిసెంబర్ 22న రజిని ఓటు కోసం దరఖాస్తు చేయగా, దాన్ని అధికారులు ఆమోదించి ఓటర్ల జాబితాలో చేర్చారు. తప్పుడు పత్రాలు పెట్టిన వారికి ఓటు ఎలా ఇస్తారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, టీడీపీ కార్పొరేటర్ శ్రీరాంప్రసాద్ ప్రశ్నించారు. మంత్రి రజిని ఓటును తొలగించాలని ఫాం-7 దరఖాస్తు కూడా ఆందజేశామన్నారు.