TDP Leader Prathipati Pulla Rao: తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టుల కలయికను ప్రజలు కోరుకుంటున్నారు : పత్తిపాటి - జనసేన పొత్తులపై పత్తిపాటి పుల్లారావు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 6:44 PM IST
TDP Leader Prathipati Pulla Rao: రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టుల కలయికను కోరుకుంటున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మూడు పార్టీల కలయికతో ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయనే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారని పత్తిపాటి పేర్కొన్నారు. టీడీపీ, జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడో మాట్లాడిన వీడియోలను తిప్పుతూ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారమంతా అబద్ధాలనే నిర్ణయానికి ప్రజలు కూడా వచ్చారన్నారు.
నాలుగున్నరేళ్లుగా వైసీపీ అరాచకాలతో అక్రమ కేసులు పెట్టి నియోజకవర్గాలను దోచుకున్నారని పేర్కొన్నారు. ఆ భయమే ఇప్పుడు వైసీపీ నేతలను వెంటాడుతుందని పత్తిపాటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత... వైసీపీలో మాట్లాడేవారే కరవయ్యారని తెలిపారు. పవన్‌కల్యాణ్ మద్దతు ప్రకటనతో వైసీపీ నేతల నోళ్లు మూతపడ్డాయని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మిగిలిన నాయకుల నోళ్లు కూడా పెగలడం లేదన్నారు. టీడీపీ, జనసేన కలయికతో ఏకపక్ష ఎన్నికలు జరగబోతున్నాయనే విషయం వైసీపీకి అర్థమైందన్నారు. వైసీపీ పెద్దల ఒత్తిడితోనే కొంతమంది నాయకులే మాట్లాడుతున్నారని పుల్లారావు పేర్కొన్నారు.