Pattabhiram Comments on Fiber Net Allegation: చంద్రబాబు, లోకేశ్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు: పట్టాభిరామ్ - చంద్రబాబుపై మరో కేసు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-10-2023/640-480-19656967-thumbnail-16x9-pattabhiram.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 8:04 PM IST
Pattabhiram comments on Fiber Net Allegation: వైసీపీ కక్షసాధింపు చర్యలను తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతోంది. అధికార పార్టీ అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాలను ఎలా ఇబ్బందులు పెడుతుందో ప్రజలకు తెలియజేస్తోంది. తాజాగా స్కిల్డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును జైలుకు పంపిన వైసీపీ ప్రభుత్వం.. మరో కుట్రకు తెరలేపిందని తెలుగుదేశం(TDP) అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. ఫైబర్ నెట్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ.. టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ఆరోపణలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జగన్‌రెడ్డి ఫైబర్ నెట్‌పై (Fiber Net) కుట్రకు తెరతీశారని పట్టాభిరామ్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో వేసిన తీగలు, అనుబంధ పరికరాల్ని తొలగించాలంటూ అప్పటి ఈడీ అంజయ్య.. రాజేశ్‌రాయ్ అనే వ్యక్తికి మెయిల్ పంపారని ఆరోపించారు(Allegation). జిల్లాల వారీగా ఎంతెంత విస్తీర్ణంలో కోత పెట్టాలో వివరిస్తూ 524 కిలోమీటర్ల మేర తొలగించాలని శ్రీనివాసరావుకు రాజేశ్‌రాయ్ మెయిల్ పంపారని ధ్వజమెత్తారు. దానికి సంబంధించిన ఈ-మెయిళ్లను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. కావాలనే వైర్లు కోసి, అనుబంధ పరికరాల్ని మాయం చేశారని తెలిపారు. పైగా.. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదని జగన్‌రెడ్డి, అమర్‌నాథ్ గుండెలు బాదుకుంటూ.. చంద్రబాబు, లోకేశ్‌ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.