అసైన్డ్ భూముల్ని దళితులకు పంచే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా?: నక్కా ఆనంద్‌బాబు

🎬 Watch Now: Feature Video

thumbnail

TDP leader Nakka Anand Babu on Assigned Lands: దళితుల అసైన్డ్ భూములకు సంబంధించి.. మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆక్రమించుకున్న అసైన్డ్ భూములను దళితులకు పంచే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా..? అని సవాల్ విసిరారు. ఎస్సీలకు ఒక్క ఎకరమైనా తిరిగిచ్చామని జగన్ చెప్పగలరా..? అని ప్రశ్నించారు. ఎస్సీలకు ఎప్పుడో ఇచ్చిన భూములపై ఇప్పుడు హక్కులు కల్పిస్తున్నామంటూ సీఎం జగన్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nakka Anand Babu Comments: ''ఇడుపులపాయలో తమకు అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయని స్వయంగా వైఎస్‌ రాజశేఖర్ రెడ్డే అసెంబ్లీలోనే ఒప్పుకొన్నారు. కానీ, చీమల పుట్టల్లోకి పాములు దూరినట్టు ఈ నాలుగేళ్ల జగన్ పాలనలో వైసీపీ నేతలు దళితులు, ఇతర వర్గాల భూముల్ని ఆక్రమించుకున్నారు. విశాఖపట్టణంలో విజయ సాయిరెడ్డి, వైసీపీ నేతలు కొట్టేసిన 40వేల ఎకరాల్ని పేదలకు పంచే ధైర్యం జగన్‌కు ఉందా..?. రాష్ట్ర వ్యాప్తంగా కొల్లగొట్టిన 14 లక్షల ఎకరాలపై వారికి సర్వహక్కులు కల్పించడానికే జగన్.. 'భూ హక్కు-భూ రక్ష' అని కట్టుకథలు చెబుతున్నాడు. 1954 నుంచి గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములపై జగన్ హక్కులు కల్పించేదేంటి..?. ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద ఒక్క ఎస్సీకైనా 4 సెంట్లు ఇచ్చారా..?.'' అని నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.