Dhulipalla on R5 Zone Houses: 'మాటల్లో ప్రేమ.. చేతల్లో విషం.. ఇదే జగన్​ నైజం' - ap latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 24, 2023, 8:12 PM IST

Dhulipalla Narendra Fire on CM Jagan Inaugurates R5 Zone Houses : పేదల నాశనం కోసమే 4 సంవత్సరాలుగా సీఎం జగన్​ మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ధ్వజమెత్తారు. మాటల్లో పేదలపై ప్రేమ చూపటం, చేతల్లో విషం చిమ్మటం జగన్ నైజమని ఆయన విమర్శించారు. రాజధానిలో సెంటు పట్టా పేరుతో సీఎం చేపట్టిన ఇళ్ల నిర్మాణం పేదలని మోసగించటమేనని దుయ్యబట్టారు. ఎక్కడైతే పేదలకు ఇల్లు అవసరమో అక్కడ కట్టకుండా, అనవసరమైన చోట నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడెక్కడి వారికో అమరావతిలో ఇళ్లు ఇచ్చి.. తాను విశాఖ వెళ్తానంటున్నాడని ధూళిపాళ్ల ఆక్షేపించారు. పేదలపై అంత చిత్తశుద్ధి ఉంటే పోలవరం నిర్వాసితులకు ఎందుకు ఇళ్లు కట్టట్లేదని నిలదీశారు. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, అందుకు విరుద్ధంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేయటమేంటని నిలదీశారు. పేదలు రాజధాని కోసం భూ త్యాగాలు చేసిన నాడే అమరావతి సామాజిక స్ఫూర్తికి నాంది పలికిందని అన్నారు. 30లక్షల ఇళ్ల నిర్మాణం హామీతో అధికారంలోకి వచ్చి, ఆ హామీనే విస్మరించిన జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి ఎలా అవుతాడని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అయితే అమరావతిలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన 5వేల టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.